నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న10 మంది నిందితుల అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరార్ అయ్యారు. నిందితుల నుంచి సుమారు 3, 67,500 లక్షలు విలువ చేసే 735 నకిలీ 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లతో పాటు ల్యాప్ ట్యాప్, కలర్ ప్రింటర్, స్కానర్, లామినేషన్ మిషన్, ఆర్బీఐ అక్షరాలతో ముద్రించే ఆకు పచ్చ రిబ్బన్, ఏ4 పేపర్ బండిల్స్, 12 మొబైల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులలో ఎనిమిది మంది అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీ నోట్లను నిందితులు విక్రయించినట్లు తేలింది. వాయల్పాడు లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదుతో ఈ నకిలీ కరెన్సీ నోట్లు బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేసిన వాయల్పాడు పోలీసులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)