ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడతలో మరింత భూసేకరణ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా వివాదాలకు తావు లేకుండా భూసమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని నిర్ణయించింది. తొలి విడతలో అప్పట్లో జరిగిన భూసమీరణ విజయవంతమైంది. అప్పట్లో 36 వేల ఎకరాలను ఈ పద్ధతిలో సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో 40 నుంచి 45 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పెదకూరపాడు, తాడికొండ మండలాల్లో ఇలా భూముల్ని తీసుకోవాలని నిర్ణయించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 26 వేల ఎకరాలు, తాడికొండలో 12 వేల ఎకరాలు మొత్తం 38 వేల ఎకరాలు ఇప్పటికే రైతులు స్వచ్చందంగా ఇచ్చేందుకు అంగీకరించారని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి మిగిలిన భూమిని కూడా త్వరలోనే సేకరించనున్నారు.అమరావతిలో రెండో విడతలో తీసుకునే భూముల్లో 5 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు, 2500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు, మరో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తారు. అలాగే ఈ భూములిచ్చిన రైతులకు మూడేళ్లలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే రాజధానిలో వైద్య, విద్య సంస్థలు ఏర్పాటు చేసే వారికి రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపు ఇవ్వాలని తాజాగా జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. పెట్టుబడులు రావాలంటే, భూముల విలువ పెరగాలంటే ఎయిర్ పోర్టుతో పాటు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేస్తే ఏడాదికి రెండు, మూడు ఈవెంట్లు అయినా నిర్వహించి వివిధ దేశాల క్రీడాకారుల్ని రప్పించేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.
అమరావతి రెండో విడతలో మరింత భూసేకరణ చేసేందుకు ప్లాన్ రెడీ
June 03, 2025
0
Tags