పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు. బాలురలో 73.55 శాతం, బాలికల్లో 80.10శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. జూన్‌ 13 నుంచి 19వ తేదీ వరకు రీకౌంటింగ్‌/ రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500; రీవెరిఫికేషన్‌కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)