అమరావతిలో నిర్మాణ సంస్థలతో డీఎస్పీ సమావేశం

Telugu Lo Computer
0


మరావతిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్మికులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల వివరాలు తమకు అందజేయాలిన తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఆయా నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కార్మికులు పనిచేసే పని ప్రదేశాల వద్ద, వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, నేరస్థులను పనుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని ఆయా కంపెనీల ప్రతినిధులకు పోలీసులు స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు రాజధాని ప్రాంతంలోకి వస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ సమావేశం నిర్వహించామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)