టాటా హారియర్‌ ఈవీ విడుదల !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్‌ కార్లలో ఒకటైన హారియర్‌లో విద్యుత్తు వేరియంట్‌ విడుదలైంది. విలాసవంతమైన పవర్‌ఫుల్‌ కార్లలో లభించే పలు ఫీచర్లను వినియోగదారులకు టాటా ఈవీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు వర్ణాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. వాటిల్లో ఎంపవర్డ్‌ ఆక్సైడ్‌, నైనిటాల్‌ నక్టర్న్‌, ప్రిస్టైన్‌ వైట్‌, ప్యూర్‌ గ్రే ఉన్నాయి. నలుపు రంగులోని స్టెల్త్‌ ఎడిషన్‌ కూడా టాటా విక్రయించనుంది. దీని బ్యాటరీ ప్యాక్‌కు లైఫ్‌టైమ్‌ వారెంటీ ఉందని టాటా పేర్కొంది. ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ మోడల్‌ ధర రూ.21.49 లక్షలగా ప్రకటించింది. ఈ కారు బుకింగ్స్‌ జులై 2వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. టాటా హారియర్‌ ఈవీ 0-100 స్పీడును కేవలం 6.3సెకన్లలో అందుకొని ఈ శ్రేణిలో వేగవంతమైన ఈవీగా నిలిచింది. డ్రిఫ్ట్‌, బూస్ట్‌ మోడ్‌లో డ్యూయల్‌ మోటార్‌ క్వాడ్‌ వీల్‌ డ్రైవ్‌ నాలుగు చక్రాలకు శక్తిని సరఫరా చేస్తుంది. ఇక డ్రైవింగ్‌లో శాండ్‌, రాక్‌ క్రాల్‌, బూస్ట్‌మోడ్‌, ట్రాన్స్‌పరెంట్‌ మోడ్‌, ఆఫ్‌ రోడ్‌ అసిస్ట్‌ వంటివి ఆరు రకాల మోడ్‌లు ఉన్నాయి.ముఖ్యంగా ట్రాన్స్‌పరెంట్‌ మోడ్‌లో వాహనం కింద రోడ్డును నేరుగా స్క్రీన్‌లో వీక్షించే అవకాశం ఉంది. ఇది ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. ఒక కారులో నుంచి మరో కారుకు ఛార్జింగ్‌ చేసుకొనే అవకాశం దీనిలో ఉంది. హారియర్‌ ఈవీని ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఎంఐడీసీ సర్టిఫై చేసింది. సుదూర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. దీనిని ఫాస్ట్‌ ఛార్జింగ్‌లో పెడితే కేవలం 15 నిమిషాల్లో 250 కిలోమీటర్లు ప్రయాణానికి సరిపడేలా బ్యాటరీ సిద్ధమవుతుంది. దీనిలో మాప్లస్‌ ఆటోఈవీ ఇంటిగ్రేషన్ తో డ్రైవర్‌కు సమీపంలోని ఛార్జర్స్‌ తెలుస్తాయి. ఈ ఎస్‌యూవీలో తొలిసారి 14.5 అంగుళాల శామ్‌సంగ్‌ నియో క్యూఎల్‌ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అమర్చారు. దీనిని జేబీఎల్‌ బ్లాక్‌ 10 స్పీకర్‌ సిస్టమ్‌, డాల్బీ అట్మోస్‌కు అనుసంధానించారు. ఈ కారులో 540 డిగ్రీ కెమెరా అదనపు ఆకర్షణగా నిలిచింది. బ్లైండ్‌స్పాట్‌ మానిటరింగ్‌, 128 జీబీ స్టోరేజీతో బిల్ట్‌ఇన్‌ డాష్‌కామ్‌, క్యూఆర్‌ ఆధారంగా వీడియోలను తిరిగి పొందే అవకాశం కల్పించారు. ఈ కారులో రిమోట్‌ ఫీచర్లు కూడా అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఆటోపార్క్‌ అండ్‌ సమన్‌ మోడ్‌ సాయంతో వాహనాన్ని రిమోట్‌ పార్కింగ్‌ చేయించవచ్చు. ఇక స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, ఎన్‌ఎఫ్‌సీ కార్డు సాయంతో డిజిటల్‌ కీ యాక్సెస్‌ చేయవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)