తిరుచానూరులో కారులో ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యం

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం కారులో బీర్లు తాగిన యువకులు మద్యం మత్తులో అలాగే నిద్రించడంతో ఊపిరాడక మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే కారులో నాలుగు బీరు బాటిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను వినయ్, దిలీప్ గా గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)