భారత సంతతి వ్యక్తిపై ఆస్ట్రేలియా పోలీసుల కర్కశత్వం

Telugu Lo Computer
0


స్ట్రేలియా పోలీసుల కర్కశ ప్రవర్తన వల్ల భారత సంతతి వ్యక్తి ఒకరు మెదడు దెబ్బ తిని కోమాలోకి వెళ్లారు. స్థానిక మీడియా షేర్‌ చేసిన వీడియో ప్రకారం బాధితుడు గౌరవ్‌ కుండిని (42) అడిలైడ్‌ తూర్పు శివార్లలో పోలీసులు రోడ్డు పైన బలవంతంగా తీసుకెళ్లారు. అదే సమయంలో ఆయన భార్య అమృత్‌పాల్‌ కౌర్‌ తన భర్త అమాయకుడని పోలీసులకు విన్నవించారు. 'నేను ఏ తప్పు చేయలేదు' అని గౌరవ్‌ బిగ్గరగా అరిచారు. పోలీసులు అన్యాయంగా ప్రవర్తించారని కౌర్‌ ఆరోపించారు. ఆస్ట్రేలియా టుడే నివేదిక ప్రకారం గౌరవ్‌ను పోలీసులు నేలకేసి కొట్టడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. తన భర్తను కిందపడేసి, మెడపై మోకాలితో తొక్కిపెట్టారని కౌర్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న గౌరవ్‌ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అరెస్ట్‌ చేయాలని ప్రయత్నించినప్పుడు అతడు హింసాత్మకంగా ప్రతిఘటించాడని పోలీసులు ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)