ఆధార్ డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు మరో ఏడాది పాటు పొడిగింపు

Telugu Lo Computer
0


ధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువు నేటితో గడువు ముగియాల్సి ఉండగా, దానిని మరో ఏడాది పాటు, అంటే 2026 జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచేందుకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని మరోసారి కల్పిస్తున్నామని, దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ వెల్లడించింది.ఆధార్ కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం గుర్తింపు ధృవీకరణ పత్రం (పీఓఐ), చిరునామా ధృవీకరణ పత్రం (పీఓఏ)లను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. వివాహం, ఉన్నత చదువులు లేదా ఉద్యోగ రీత్యా నివాసం మారిన వారికి ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే స్పష్టం చేసింది.ఈ ఉచిత అప్‌డేట్ సేవలను 'మై ఆధార్' పోర్టల్ ద్వారా పొందవచ్చు. గతంలో ఆధార్ కేంద్రాలకు వెళ్లి వివరాలను మార్చుకోవాలంటే రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎటువంటి ఖర్చు లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)