పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన వారిపై చంద్రబాబు ఆగ్రహం

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని సమావేశం ముగింపు సందర్భంగా గట్టిగా హెచ్చరించారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారని సీఎం అసహనం వ్యక్తంచేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకూ ఎంత మంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. గైర్హాజరుకు కారణాలు అడిగితే కొందరు విదేశీ పర్యటనలు అన్నారు, ఇంకొంతమంది దైవ దర్శనాలు అని సమాధానం ఇచ్చారని నేతల గైర్హాజరుపై చంద్రబాబు చురకలు అంటించారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతరత్రా ఎక్కువయ్యాయా అని నిలదీశారు. దేవాలయ సందర్శనలు మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని హితవు పలికారు. తానా, ఆటాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా తన వద్ద ఉందని నేతలతో సీఎం అన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)