మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రవీంద్ర చవాన్ నామినేషన్

Telugu Lo Computer
0


హారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడిగా కిరణ్ రిజిజూ హాజరైనట్లు ఆయన వెల్లడించారు. రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ బావంకులే లతోపాటు ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారని తెలిపారు. సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ రవీంద్ర చవాన్ రాజకీయ జీవితం యువజన విభాగం కార్యకర్తగా ప్రారంభమైందని, ఆ తర్వాత కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగారన్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడం మాకు గర్వకారణం అని అన్నారు. చంద్రశేఖర్ బావంకులే రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని ఫడ్నవీస్ ప్రశంసించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కృషి ఫలితాల రూపంలో కనిపించిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)