ఢిల్లీలోని ఫంక్షన్ హాలులో భారీ అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని మోతీనగర్‌లో ఒక ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి 8.47 గంటల ప్రాంతంలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు చేరుకున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)