సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా?

Telugu Lo Computer
0


ఆర్సీబీ విజయోత్సవాల వేళ సంభవించిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. గతంలో జరిగిన పలు తొక్కిసలాట  ఘటనలను ప్రస్తావిస్తూ సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా? అని ఆయన ప్రశ్నించారు. ''ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట, కుంభమేళాలో తొక్కిసలాట, బెంగళూరులో తొక్కిసలాటలలో డజన్లకొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలు చేయలేదు. పాఠాలు నేర్చుకోలేదు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ కప్‌ ఛాయ్‌ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారట్లేదు'' అని గోయెంకా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ''ఇది చాలా దురదృష్టకర ఘటన. నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే, అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది'' అని కొందరు రాసుకొచ్చారు. సామాన్యుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)