తెలంగాణలో వ్యాయామ విద్య (బీపీఎడ్, డీపీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల పాలమూరు విశ్వవిద్యాలయం నిర్వహించిన పీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 94.96శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు టీజీ పీఈసెట్ కన్వీనర్ ఆచార్య ఎన్.ఎస్. దిలీప్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పీఈసెట్ ఫలితాలు విడుదల
June 17, 2025
0
Tags