హైదరాబాద్ నగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో అంతరయోగం- ధ్యానశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 15వ తేదీన ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో పారాయణ, జపం, భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రసంగం జరగనుంది. రామకృష్ణ మఠంలోని పూజా మండపం వేదిక జరిగే ఈ కార్యక్రమానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి. పురుషులు తెల్లని వస్త్రాలు ధరించి రావాలి. ఇందుకు సంబంధించిన కూపన్‌లు మఠం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, రూ.100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ రామకృష్ణ మఠంలో 'అంతరయోగం'
June 10, 2025
0
Tags