సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు పై దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధ నలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. భవిష్యత్ లో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాల్లో తాము నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది. చర్చలను గౌరవ ప్రదంగా చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది.
కొమ్మినేని శ్రీనివాస రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
June 13, 2025
0
Tags