ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అరెస్టు

Telugu Lo Computer
0


ర్ణాటక ప్రభుత్వం బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని  సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో పాటూ సీఎం సిద్ధరామయ్య డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీబీ, డీఎన్ఏ మేనేజ్ మెంట్, కెఎస్సీఏ ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పారు. ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంఛైజీ యాజమాన్యం మీద కేసు నమోదయ్యింది. ఇందులో డీఎన్ఏ, కెఎస్సీఏ, ఆర్సీబీలను ఏ1,2,3లుగా చేర్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలే అరెస్టయ్యారు. ముంబై వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళ్ళిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. విక్టరీ పరేడ్ కోసం సొసలే అనధికార ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ జైరామ్ పరారీలో ఉన్నారు. ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)