ఆంధ్రప్రదేశ్ ని అన్నిచోట్లా దోచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర జగన్‌ది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్నిచోట్లా దోచేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర జగన్‌దని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ఈ శతాబ్దపు విడ్డూరమని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలన ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)