చీరాల 'కుప్పడం' చీరకు జాతీయస్థాయి గుర్తింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సిల్క్‌ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 'ఒకే జిల్లా - ఒక ఉత్పత్తి' ఓడీపీ-2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె. వెంకటమురళి ఈనెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరి నెలలో బాపట్ల విచ్చేసిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంతంలో మాత్రమే మగ్గాలపై నేత నేసే కుప్పడం చీరలను పరిశీలించారు. అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్టు అధికారికంగా జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం సమాచారం అందింది. కుప్పడం చీరకు అవార్డు రావడంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు వచ్చిందని కలెక్టర్‌ వెంకట మురళి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)