తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో ఆమె దాదాపు 18 ఏళ్ల పని చేసిన అనుభవం ఉంది. స్వేచ్ఛకు పెళ్లై ఓ పాప ఉంది. విడాకులు తీసుకొని మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్ లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి శంకర్, ఉమ్మడి ఏపీలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వేచ్ఛ, తన కుమార్తె, ఓ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తున్నారు. అయితే, ఆ అతనితో ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య
June 28, 2025
0
Tags