జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడి, బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టిన దుండగులు

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పుణె జిల్లా భిగ్వాన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో నడిరోడ్డుపై కారు ఆపిన కొద్దిసేపటికే దుండగులు దోపిడీకి పాల్పడి, ఓ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. ఓ కారులో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ప్రయాణిస్తుండగా, డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాహనాన్ని హైవే పక్కన నిలిపారు. డ్రైవర్ కారు నుంచి దిగి వెళ్లిన వెంటనే, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకుని నేరుగా కారు వద్దకు వచ్చి, లోపల ఉన్న మహిళలను పదునైన ఆయుధాలతో భయపెట్టారు. వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నారు. నగలు దోచుకున్న తర్వాత దుండగుల్లో ఒకడు కారులోనే ఉన్న 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అకస్మాత్తు పరిణామంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఠాణే ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ "ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం" అని మీడియాకు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)