తిరుపతిలో మత్తు ఇంజక్షన్లకు బానిసవుతున్న యువత : సోషల్ మీడియాలో వీడియో వైరల్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో  ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద యువకులు మత్తు ఇంజక్షన్లతో మత్తు ఎక్కించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తరచు ఇంజెక్షన్లు వేసుకొని మార్కెట్ లో గొడవలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకున్న వారు రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను మత్తు పదార్థాల బానిసగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలను తల్లిదండ్రుల ఒక కంట కనిపెడుతూ ఉండాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)