హైదరాబాద్‌ లో ఇల్లు, ఫ్లాట్ కొనే వారికి హైడ్రా హెచ్చరిక

Telugu Lo Computer
0

హైదరాబాద్ లో ఇళ్లు, ప్లాట్ల కొనుగోలుదారులు నగరంలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు వివరాలను ధృవీకరించాలన్నారు. హైదరాబాద్‌ లో ఆక్రమణలకు గురైన భూమిలో ఉన్న అపార్ట్‌మెంట్లు, ఇళ్లు కూల్చివేతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన నాలాపై నిర్మించిందా? లేదా? అనే దానితో సహా ఆస్తి వివరాలను ధృవీకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా అలాంటి ఆస్తులను కూల్చి వేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో నాలాల ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 47 పిటిషన్లు వచ్చాయని హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రమాదాలను తగ్గించడానికి రానున్న రోజుల్లో పూడిక తొలగింపు, ఆక్రమణల నిరోధక కార్యకలాపాలు వేగవంతం కానున్నట్లు స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)