హైవేపై ట్రక్కును తగలబెట్టిన మావోయిస్టులు

Telugu Lo Computer
0


త్తీస్‌ఘఢ్‌లోని బీజాపూర్-జగదల్పూర్ రహదారిలో  శుక్రవారం మావోయిస్టులు భైరంగఢ్ సమీపంలోని కరణమార్క వద్ద ఉల్లిపాయలతో నిండిన ఓ ట్రక్కును నక్సలైట్లు తగలబెట్టారు. ఈ ఘటనలో ట్రక్కుకు నిప్పంటించిన అనంతరం, మావోయిస్టులు ఒక ప్రయాణికుల బస్సును సుమారు 30 నిమిషాల పాటు బందీగా ఉంచారు.తర్వాత బస్సును బయలుదేరేందుకు అనుమతించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను రేకెత్తించింది. మావోయిస్టుల ఈ చర్యపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)