తెలంగాణ లోని మహబూబాబాద్ నుండి మరిపెడ 365 జాతీయ రహదారిపై కురవి లింగ్య తండ సమీపంలో టాటా ఏసీ ట్రాలీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ఘటనలో తొడుసు నేహాశ్రీ (16) అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కురవి మండల కేంద్రానికి చెందిన తొడుసు వెంకన్న సరిత దంపతుల కూతురు నేహాశ్రీ ఈ ఏడాది పది ఫలితాల్లో 560 మార్కులు సాధించింది. సోమవారం ఇంటర్మీడియట్ కాలేజీలో చేరేందుకు వెల్లాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఆ బాలికను బలితీసుకుంది. ఆటోడ్రైవర్ కానిగంటి రాజు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టాటా ఏసీ ట్రాలీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో యువతి మృతి
June 08, 2025
0
Tags