హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయం 5గంటలకు కన్నుమూశారు. మూడు రోజులుగా మాగంటి గోపీనాథ్ వెంటిలేటర్ పై చికిత్స పొందతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్తానం మొదలైంది. 2018లో టీఆర్ఎస్‌లో చేరారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 1983లో టీడీపీతో మాగంటి రాజకీయాల్లోకి వచ్చారు. 1985 - 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1987, 1988లో హుడా డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 23లో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
June 08, 2025
0
Tags