క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కమల్ హాసన్

Telugu Lo Computer
0


ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాష తమిళం నుంచి వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచించినప్పటికీ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమా థగ్ లైఫ్  కర్ణాటకలో విడుదల కావడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కమల్ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ఈ సినిమా విడుదల కాదని కన్నడ అభిమాన గ్రూపులు, కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న విడుదల కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)