తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల అంకుశాపూర్ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ..'నేను ఏసీబీ విచారణలో ఉంటే నాకు ధైర్యం చెప్పాడు. కానీ ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వారి ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిలు, వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటాను. వారికి మాట ఇస్తున్నా. ఇదే సమయంలో పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల లాగా మేము దిగజారి ప్రవర్తించలేదు' అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి : కేటీఆర్
June 18, 2025
0
Tags