విశాఖపట్నంలో జూన్ 20, 21 తేదీల్లో డ్రోన్ లు నిషేధం

Telugu Lo Computer
0


విశాఖపట్నం బీచ్ లో డ్రోన్ లు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని బీచు రోడ్డులో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలో జూన్ 20, 21 తేదీల్లో విశాఖపట్నంలో డ్రోన్ వినియోగాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలో తొలిసారి వేడుకలు జరగనున్నాయి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలోని బీచు రోడ్డులో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో ఆంక్షలు విధించారు పోలీసులు. జూన్ 18 నుంచే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు గమనించాలని పోలీసులు తెలిపారు. పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకలకు ఆంక్షలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు విజయనగరం నుంచి వచ్చే బస్సుల్లో బోయపాలెం వైపు రావాలని, అల్లూరి జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపగుంట వైపు నుంచి రావాలని సూచనలు చేశారు. ఈ మేరకు ఈ నెల 20, 21న నగరంలో ఏ విధమైన డ్రోన్ లు కూడా ఎగురవేయకూడదని పోలీసులు సూచనలు చేశారు. ప్రధానంగా ఐఎన్ఎస్ చోళ, ఏయూ మైదానం, కాళీ మాత ఆలయం, ఐఎన్ఎస్ కళింగ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు నిషేధమని తెలిపారు. ఎవరైనా డ్రోన్ లు వినియోగానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)