ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


తెలంగాణలో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రేపు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికలపై తేదీపై క్లారిటీ ఇస్తామని మంత్రి తెలిపారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వండి. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది..వారం రోజుల్లో 'రైతు భరోసా', సన్నాలకు బోనస్ను రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని పొంగులేటి చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)