బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
10–12 minutes
Harish Rao: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
10m
హైదరాబాద్: బీజేపీతో (BJP) బీఆర్ఎస్ (BRS) పొత్తు వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) స్పందించారు.
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని కొందరు అంటున్నారని..
కేసీఆర్ మొన్ననే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిపారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన సందర్భగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకోమని తేల్చిచెప్పారు. ఎవరో పొత్తు పెట్టుకుంటామన్నట్లు కొందరు మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటామని పోలీసు, ఇతర అధికారులను హెచ్చరించారు. జాగ్రత్త , రాబోయేది తమ ప్రభుత్వమేనని వార్నింగ్ ఇచ్చారు. రూ.12 వేల కోట్లు నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ , ఒక కార్పొరేషన్ చైర్మన్ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తున్నాయని అన్నారు. వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సమీక్షలు చేస్తున్నావా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీనేనని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి అన్యాయం చేస్తుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపమని ఆరోపించారు. బనకచర్లను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బనకచర్లను అపుతామని అన్నారు. బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి అన్యాయం చేస్తుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీ తెలంగాణాకు ఏం చేసిందని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపమని ఆరోపించారు. బనకచర్లను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బనకచర్లను అపుతామని అన్నారు.