ఆపరేషన్ సిందూర్​ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్ ​కు ఓటమి గుర్తుకువస్తుంది : ప్రధాని నరేంద్ర మోడీ

Telugu Lo Computer
0

జమ్మూ కాశ్మీర్ లోని చినాబ్‌ వంతెన ప్రారంభం సందర్భంగా కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడుతూ భారతీయ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్‌ రైల్వే తీగల వంతెన ఒక నిదర్శనం కొనియాడారు. కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కల నేటికి సాకారమైందని చెప్పుకొచ్చారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కాశ్మీర్ ప్రజలను పాకిస్తాన్ దోచుకున్నదన్నారు. పొరుగుదేశం మానత్వానికి, సామరస్యానికి, పర్యాటకానికి శత్రువుగా తయారైందని ఆరోపించారు. పెహల్గామ్‌లో మానవత్వం, కశ్మీరతత్వంపై పాకిస్తాన్ అటాక్ చేసింద న్నారు. కశ్మీర్ ప్రజల ఆదాయాన్ని దోచుకునేందుకు టూరిస్టులపై పాక్ దాడికి పాల్పడిందన్నారు. ఇకపై ఆపరేషన్ సిందూర్​ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్ ​కు ఓటమి గుర్తుకువస్తుందన్నారు. ఉగ్ర వాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. అయితే ఈ పోరాటంలో జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా ఉండాలని మోడీ  పిలుపునిచ్చారు. అలాగే భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి అదనంగా రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కోసం రూ.1 లక్ష ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మోడీ చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్​ సహా దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు పేదలను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)