జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి పర్యాటక క్యారవాన్లను సీఎం ప్రారంభించారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారని కానీ నైపుణ్యం పెంచుకుని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికీ పోవని చంద్రబాబు చెప్పారు. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని గుర్తు చేశారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్నా బాబా రామ్‌దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని, పర్యాటకశాఖకు సలహాదారుగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లోనే అందిస్తామని వెల్లడించారు. పర్యాటకరంగంలో అనేక ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్‌దేవ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. యోగా, మెడిటేషన్ గేమ్ ఛేంజర్ కానున్నాయన్న సీఎం, అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే సేంద్రీయ సాగు ఎక్కువ చేస్తున్నామని గుర్తు చేశారు. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలని, మన రాష్ట్రానికి అద్భుతమైన సముద్ర తీరం ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అనేకచోట్ల అందమైన అటవీ ప్రాంతం ఉందని, పాపికొండలు, కోనసీమ, హార్సిలీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువాళ్లే అని పేర్కొన్నారు. విదేశాల్లో ఎక్కువ ఆదాయం పొందుతున్నదీ తెలుగువాళ్లేనన్నారు. బకింగ్‌హామ్ కాలువ ద్వారా కాకినాడ-చెన్నై మధ్య వాణిజ్యం జరిగేదని గుర్తు చేశారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానిం చారు. నైపుణ్యం పెంచుకుని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికీ పోవని, దేశంలోనే ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా ఏపీ మారాలని కోరుకుంటున్నామని చెప్పారు. పర్యాటకరంగం అభివృద్ధిపై ఏటా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. బాబా రామ్‌దేవ్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. దేశంలో 1991 తర్వాత పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, తర్వాత మనదేశంలో ఐటీ బాగా అభివృద్ధి చెందిందని చంద్రబాబు గుర్తు చేసారు.
పర్యాటకశాఖకు సలహాదారుగా రాం దేవ్ బాబాకు ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు
June 27, 2025
0
Tags