పాశమైలారంలో రియాక్టర్ పేలి పది మంది కార్మికులు దుర్మరణం

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమీపంలోని  పాశమైలారంలో ఉన్న సీగాచి కెమికల్స్‌ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పాశమైలారంలోని సీగాచి కెమికిల్స్‌ పరిశ్రమలో రోజు వారిగా కార్మికులు పనులు చేస్తుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఘటనా స్థలంలో ఉన్న కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరి పడినట్లు తెలుస్తుంది. కాగా, ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కార్మికులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పేలుడు ధాటికి తీవ్ర గాయాలతో అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అలాగే మరో ఐదుగురు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయినట్లు తెలుస్తుంది. మరో 15 మంది పేలుడు దాటికి కూలిన శిథిలాకింద చిక్కుకున్నారు. పేలుడు దాటికి మరో 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే భారీ పేలుడు అనంతరం కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నాయి. అయితే .. కెమికల్‌ఫ్యాక్టరీ కావడంతో మంటల చెలరేగడం వల్ల ఘాటైన వాసన వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)