దేశ గతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు : చంద్రబాబు

Telugu Lo Computer
0


భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని గుర్తుచేశారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారని కొనియాడారు. ''తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం'' అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.  ''పీవీ తెలుగు ఠీవీ. నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం. సొంత భూములు పంచి పెట్టి భూ సంస్కరణలను ప్రవేశపెట్టిన మహనీయుడు. దేశ ఆర్థిక ప్రగతికి పునాది వేసిన రాజ నీతిజ్ఞుడు. పీవీని కాంగ్రెస్, భారాస పార్టీలు విస్మరించాయి. ఎన్నికలప్పుడే ఆయన పేరును వాడుకుని భారాస వదిలేసింది. పీవీ విజ్ఞాన వేదికను నేటికీ ఏర్పాటు చేయకపోవడం శోచనీయం'' అని  కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)