బ్రిటన్ ప్రభుత్వం తమ దేశంలోని టీచర్లు మూల్యాంకనం వేగవంతం చేయడానికి, ఇంట్లో ఉండే తల్లితండ్రులకు ఉత్తరాలు రాయడానికి కృత్రిమ మేథను వాడుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకోసం ఏఐ సామాగ్రిని కూడా పాఠశాలలకు అందజేస్తోంది. దీంతో ఇప్పుడు అక్కడి టీచర్లు తాము నిత్యం చేసే పనుల్ని ఆటోమేట్ చేయడంతో పాటు బోధనా సమయంలో క్వాలిటీ పెంచేందుకు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇలా కృత్రిమ మేథను వాడుకునేందుకు టీచర్లకు అనుమతి ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో ఏఐ వాడకం పారదర్శకంగా ఉండాలని, వీటి ఫలితాల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. దీంతో బ్రిటన్ లో ఇదో పెద్ద ముందడుగుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఇలా టీచర్లు ఏఐని వాడే విషయంలో పలు సమస్యలు కూడా లేకపోలేదు. కాబట్టి క్విజ్‌లు లేదా హోంవర్క్ వంటి చిన్న పనులకు మార్కులు ఇచ్చేందుకు మాత్రమే ఏఐని వాడేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే తల్లితండ్రులకు టీచర్లు సాధారణ లేఖలు రాసేందుకు మాత్రమే దీన్ని అనుమతిస్తున్నారు. ఉపాధ్యాయులను కాగితపు పని నుండి విముక్తి చేయడం ద్వారా వారు తల్లిదండ్రులు, విద్యార్థులకు అత్యంత అవసరమైన వాటిపై దృష్టి పెట్టగలరని భావిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ లో అనేక పాఠశాలలు, కళాశాలలు ఇప్పటికే సురక్షితంగా, సమర్థవంతంగా ఏఐని వాడుతున్నాయి.
బ్రిటన్ లో టీచర్లు కృత్రిమ మేథను వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి
June 14, 2025
0
Tags