మావోయిస్టుల అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని 10 ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు. కూబింగ్‌లో భాగంగా ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం వాటిని బలగాలు నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కుతుల్ గ్రామం ఖోడ్పర్, గుర్మ్కా అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఆ క్రమంలో వీటిని అవి గుర్తించాయి. ఇక ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు నక్కి ఉండే అవకాశం ఉందంటూ భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో బీడీఎస్‌ బృందాలతో కలిసి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)