మహారాష్ట్రలోని ఛత్రపతి షంభాజీ నగర్ లో 93 ఏళ్ల నివృతి షిండే అనే ఆయన తన భార్య శాంతాబాయి తో ఆభరణాల షాప్ కు వెళ్లారు. జాల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన దంపతులు పండరీపూర్ లోని ఆశాదీ ఏకాదశి వేడుకలకు వెళ్తున్న క్రమంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. అయితే వాళ్లు షాప్ లోకి వెళ్లినప్పుడు ఏదైనా సహాయం అడుగుతారో లేదా అడుక్కోవడానికి వచ్చారేమోనని అందరూ భావించారు. కానీ తన భార్యకు మంగళ సూత్రం కొనడానికి వచ్చినట్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వయసులో భార్య కోసం మంగళ సూత్రం కొనాలని వచ్చిన ఆ జంటను చూసి షాప్ ఓనర్ ఇంప్రెస్ అయ్యాడు. వందేళ్లకు చేరుకుంటున్న జంట ఇంత అనురాగంగా, ప్రేమగా ఉండటం చూసి అబ్బురపడి కేవలం 20 రూపాయలు తీసుకుని మంగళ సూత్రం గిఫ్ట్ గా ఇవ్వడంతో వాళ్ల ఆనంద భాష్పాలకు అవధులు లేకుండా పోయింది. ఈ దృశ్యం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. ''తాత భామ్మ షాపులోకి వచ్చారు. తన భార్యకు మంగళ సూత్రం కావాలని అడిగాడు. పదకొండు వందల ఇరవై (రూ.1120) ఇచ్చి మంగళ సూత్రం కావాలని అడిగాడు. వారు అడిగే విధానం, భార్య కోసం ఆ వయసులో ఆయన పడే తపన చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే టోకెన్ అమౌంట్ 20 రూపాయలు తీసుకుని తాళి వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాను'' అని చెప్పడు షాప్ ఓనర్ అన్నాడు. పెళ్లంటే మూణ్నాళ్ల ముచ్చట అన్నట్లుగా విడాకులు తీసుకుంటూ, హత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో కడవరకు ఒకరి కోసం ఒకరు బతికే వీళ్ల గురించి తెలిసీ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాళ్లకు తాళిని గిఫ్ట్ గా ఇచ్చిన షాప్ ఓనర్ కు శభాష్ అని అభినందిస్తున్నారు.
భార్యకు తాళి కొనేందుకు జువెలరీ షాప్ కి వెళ్లిన 93 ఏళ్ల భర్త : టోకెన్ అమౌంట్ తీసుకుని తాళిని గిఫ్ట్ గా ఇచ్చిన షాప్ ఓనర్ !
June 18, 2025
0
Tags