జియో నుంచి 84 రోజులు వ్యాలిడిటీతో మూడు రీఛార్జ్ ప్లాన్లు

Telugu Lo Computer
0


రిలయన్స్ జియో 84 రోజులు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది. జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో పొందవచ్చు. మరొకటి జియో రూ.859 ప్లాన్ ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో ఆనందించవచ్చు. ఇంకొకటి  జియో రూ .889 ప్లాన్ ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో చేర్చారు. అలాగే జియో సావన్‌కు కూడా ఉచిత యాక్సెస్‌ను కూడా వినియోగదారులు పొందుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)