గ్లోబల్ మార్కెట్ లో డచ్ దేశ బ్రాండ్ 'ఫెయిర్ ఫోన్' తన మూడవ తరం మరమ్మతులకు అనువైన స్మార్ట్‌ఫోన్ 'ఫెయిర్ ఫోన్ జెన్ 6' ను విడుదల చేసింది. ఈ ఫోన్ టెక్నాలజీతో పాటు పర్యావరణ హితాన్ని కలిపి తీసుకొచ్చిన మోడ్యూలర్ ఫోన్. ఈ మొబైల్ ను వినియోగదారుడే విడగొట్టి, మరమ్మతులు చేసుకునేలా రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యంగా విడుదల చేసింది. ఈ ఫెయిర్ ఫోన్ జెన్ 6 మొబైల్ మొత్తం 12 భాగాల విడదీయగలిగిన నిర్మాణంతో రూపొందించబడింది. వినియోగదారులు కెమెరా, స్క్రీన్, బ్యాటరీ, స్పీకర్లు వంటి భాగాలను విడగొట్టి మార్పు చేసుకోవచ్చు. ఈ ఫోన్ కు సరిపడే ఫింగర్ లూప్, కార్డ్ హోల్డర్, లాన్యార్డ్, స్క్రీన్ ప్రొటెక్టర్, ఫ్లిప్ కవర్, ప్రొటెక్టివ్ కేస్ యాక్సెసరీస్ వస్తున్నాయి. ఈ ఫోన్ లో పునరుత్పాదక పదార్థాలు లేదా ఫెయిర్ మైన్డ్ మినరల్స్ కలిపి 14 రకాల పదార్థాలను ఉపయోగించినట్టు కంపెనీ చెబుతోంది. 6.31 అంగుళాల Full HD+ LTPO pOLED డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్‌రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 431ppi పిక్సెల్ డెన్సిటీ, Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కలిగి వుంది. Snapdragon 7s Gen 3 చిప్‌సెట్, 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ (2TB వరకు మైక్రో SD ద్వారా విస్తరణ), 50MP సోనీ Lytia 700C ప్రధాన కెమెరా, OIS, 10x డిజిటల్ జూమ్,13MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా (ఆటోఫోకస్, వీడియో కాల్స్‌కు అనుకూలం), 4415mAh లిథియం-అయాన్ బ్యాటరీ. (పూర్తిగా వినియోగదారుడే మార్పుచేసేలా), 30W ఫాస్ట్ ఛార్జింగ్, ఒకసారి ఛార్జింగ్‌తో 12 గంటల వరకు వెబ్ బ్రౌజింగ్ సపోర్ట్, Wi-Fi 6E, Bluetooth 5.4, NFC, GPS/A-GPS, Beidou, Galileo, GLONASS, USB Type-C పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, IP55 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, MIL-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, స్మార్ట్ సెన్సార్లు: యాక్సిలెరోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, బారోమీటర్, e-కంపాస్ కలిగి వుంది. సాఫ్ట్‌వేర్ Android 15 ప్రీ-ఇన్‌స్టాల్డ్. 2033 వరకు 8 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హామీ. Fairphone Moments మోడ్ - ఫోన్ వాడకాన్ని వ్యక్తిగతీకరించే ఫీచర్ వుంది. క్లౌడ్ వైట్, ఫారెస్ట్ గ్రీన్, హారిజన్ బ్లాక్ రంగులలో మొబైల్ లభిస్తుంది.
గ్లోబల్ మార్కెట్ లో 'ఫెయిర్ ఫోన్ జెన్ 6' విడుదల
June 26, 2025
0
Tags