గేట్స్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు విరాళం అందించిన వారెన్ బఫెట్

Telugu Lo Computer
0

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందించారు. బఫెట్ ఇప్పటివరకు అందించిన విరాళాల్లో ఇది అతిపెద్ద వార్షిక విరాళంగా నిలిచింది. గేట్స్ ఫౌండేషన్‌తో మరో నాలుగు కుటుంబ ఛారిటీ సంస్థలకు విరాళంగా వారన్ బఫెట్ 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) విలువైన బెర్క్‌షైర్ హాత్ వే షేర్లను అందించారు. తాజా విరాళంలో గేట్స్ ఫౌండేషన్‌కు 9.43 మిలియన్ షేర్లు, సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 9.4 లక్షల షేర్లు, బఫెట్ పిల్లలు హోవార్డ్, సూసీ, పీటర్ నిర్వహిస్తున్న మూడు ఛారిటీ సంస్థలకు మొత్తంగా 6.6 లక్షల షేర్లు కేటాయించారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి బఫెట్ ఇలాంటి భూరి విరాళాలను అందిస్తూనే ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)