శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను రేపటి నుంచి సెప్టెంబర్ 31 వరకు అటవీ శాఖ అధికారులు నిలిపివేయనున్నారు. భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ శాఖ వారు తెలిపారు. ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం నల్లమల అడవులలో ఉంది. భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ఈ ఆలయానికి వస్తుంటారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు అటవీశాఖ అధికారులు విరామం ఇచ్చారు.
రేపటి నుంచి సెప్టెంబర్ 31 వరకు ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల
June 30, 2025
0
Tags