చైనా మార్కెట్‌లో షావోమీ ఎస్‌యూ 7 మోడల్ తర్వాత తన రెండో ప్రోడక్ట్ వైయూ 7ను ఇటీవల లాంచ్ చేసింది. దీన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలిపాయి. దీని ధర వేరియంట్‌ను అనుసరించి సుమారు రూ.30.22 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ చెప్పింది. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ కారు లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు, 18 గంటల్లో 2.40 లక్షల ఆర్డర్లు, 24 గంటల్లో 2.89 లక్షల ఆర్డర్లను లాక్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చైనాలోని మొత్తం 351 షావోమీ ఈవీ రిటైల్ స్టోర్లలో వైయూ7 బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే షావోమీ ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్లు పొందిందో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఈ వైయూ7 మోడల్‌లో 320 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 528 ఎన్‌ఎం టార్క్‌తో గంటకు 240 కిలోమీటర్లు టాప్ స్పీడ్‌తో ఈ వేరియండ్‌ను లాంచ్ చేసినట్లు చెప్పింది. 0-100 కిమీ/గంట వేగాన్ని 5.9 సెకన్లలోనే అందుకుంటుందని పేర్కొంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 835 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని చెప్పింది. 21 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది.
3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్ అయిన షావోమీ వైయూ 7 కారు
June 30, 2025
0
Tags