షిర్డీకి జులై 3 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు

Telugu Lo Computer
0


షిర్డీ వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 3 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ - నాగర్‌సోల్ ప్రత్యేక రైలు (07007) జులై 3 నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. ఈ క్రమంలో నాగర్‌సోల్ - సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనుంది. సాయంత్రం 5.30 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు మార్గాల్లో మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్‌లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)