తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్‌ జట్టు ఘన విజయం

Telugu Lo Computer
0


నాటింగ్ హమ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్‌ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్‌ సెంచరీని, భారత్‌ తరఫున రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీని (హర్మన్‌-49 బంతుల్లో) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 113 పరుగులకే ఆలౌటైంది. కాగా, ఇంగ్లండ్‌ మహిళల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్‌పై 200 ప్లస్‌ స్కోర్‌ చేసిన రెండో జట్టుగా భారత్‌ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్‌ వేదికగా జులై 1న జరుగనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)