1990లో జేఎస్‌డబ్ల్యూ రూ.1 లక్ష షేర్లు - నేడు వాటి విలువ రూ.80 కోట్లు _ అదృష్టం అంటే ఇదే !

Telugu Lo Computer
0


ఒక వ్యక్తి 1990లో జిందాల్ గ్రూప్‌ నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్ష విలువైన షేర్లను కొనుగోలు చేశాడు. కాలక్రమేణా వాటికి సంబంధించిన పత్రాలు కాస్త మర్చిపోయాడు. ఇటీవల అతడి కొడుకు ఆ పాత పత్రాలను కనుగొని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ షేర్ల విలువ రూ.80 కోట్లు అని తేలడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ఆనందాన్ని ఆపుకోలేక సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశాడు. ఎక్స్ వేదికగా సౌరవ్ దత్తా అందుకు సంబంధించిన డాక్యుమెంట్ లను షేర్ చేయడంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు సైతం రెస్పాండ్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)