పాకిస్తాన్‌ వరదలలో ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతు

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ భారీ వర్షాలు కురవడం వల్ల విపరీత పరిస్థితులు తలెత్తాయి. స్వాత్ నదికి వరదనీరు పోటెత్తి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో పర్యటనకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్వాత్ నదీ పరివర్తన ప్రాంతంలో ఆ కుటుంబం పర్యటనకు వచ్చి ఉన్నపల, అకస్మాత్తుగా వరద రావడంతో తప్పించుకోలేకపోయారు. ఇందులో పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించి వెలికితీశారు. 80 మంది సిబ్బంది ఐదు ప్రాంతాల్లో రాత్రింబవళ్ళు రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా పలువురు గల్లంతయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)