15 రోజుల్లోనే ఓటర్ ఐడీ కార్డు డెలివరీ

Telugu Lo Computer
0


టర్లకు ఐడీ కార్డులు త్వరితగతిన అందించేందుకు కొత్త విధానాన్ని ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎన్నికల రిజిస్టర్ లో దరఖాస్తుకు సంబంధించిన మార్పులు జరిగిన 15 రోజుల్లోపే ఓటర్ ఐడీ కార్డులు ఓటర్లకు చేరేలా ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్లు పేర్కొంది. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారితో సహా, ఇప్పటికే ఉన్న ఓటరు వివరాల్లో మార్పులు చేసిన వారికి కూడా 15 రోజుల్లోనే కార్డును డెలివరీ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డులు అందడానికి ఒక నెలకు పైగా సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయబోతున్నారు. ఈ కొత్త విధానంలో, ఓటర్ కార్డు తయారవడం నుంచి ఓటరుకు అందే వరకు ప్రతి దశలో పర్యవేక్షించడం కోసం రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఈసీ వివరించింది. ఈ ప్రక్రియను ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. అంతేకాక, ప్రతి దశలో ఓటర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ఓటర్లు తమ ఓటర్ ఐడీ కార్డు స్థితిని తెలుసుకోవడానికి వీలవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)