టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి న్యూ ఫండ్ ఆఫర్ టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ వచ్చింది. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఈరోజు ప్రారంభమై జూన్ 16, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కేవలం రూ.5000 సరిపోతాయి. రూ.5 వేలు పెట్టి ఇందులో లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. ఆ తర్వాత రూ.1000 చొప్పున పెంచుకుంటూ ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్‌లో హైరిస్క్ ఉంటుందని టాటా ఏఎంసీ చెబుతోంది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్ స్కీమ్. ఈ ఫండ్ మేనేజర్ గా కపిల్ మెనన్ వ్యవహిస్తారని టాటా మ్యూచువల్ ఫండ్ తెలిపింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ బెంచ్ మార్క్ ఇండెక్సుగా ఉంటుంది. దీర్ఘకాలంలో హైరిటర్న్స్ అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫండ్ ఆఫర్ తీసుకొచ్చినట్లు టాటా ఏఎంసీ పేర్కొంది. అయితే, హైరిటర్న్స్ వస్తాయన్న గ్యారెంటీ ఏమీ ఉండదని, మార్కెట్ పరిస్థితులను బట్టి భవిష్యత్తు రాబడులు ఉంటాయని పేర్కొంది.
టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి టాటా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్
June 02, 2025
0
Tags