తల్లికి వందనం పథకం : తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు - పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం రూ. 2 వేలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం రోజున తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. గురువారం రోజే తల్లికి వందనం నిధులు బ్యాంకులకు చేరగా, అర్దరాత్రి నుంచి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తల్లికి వందనం పథకంలో భాగంగా విడుదల చేసే రూ. 15 వేలలో తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు మాత్రమే జమ చేసి, పాఠశాలల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం రూ. 2 వేలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాకు మళ్లించనున్నారు. తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి వర్తింప చేస్తున్నామని, ఇందుకోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు దానికంటే మెరుగ్గా ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల అకౌంట్‌లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)