బజాజ్ నుంచి కొత్త 125 సీసీ బైక్ ?

Telugu Lo Computer
0


జాజ్ ఆటో త్వరలో కొత్త 125సీసీ మోటార్‌సైకిల్‌ను  విడుదల చేయబోతోంది. ఈ సెగ్మెంట్‌లో పల్సర్ 125, పల్సర్ ఎన్ఎస్125, పల్సర్ ఎన్125, సీఎన్‌జీతో నడిచే ఫ్రీడమ్ 125 వంటి బైకులు బజాజ్ నుండి అందుబాటులో ఉన్నాయి. బజాజ్ మొత్తం బైక్ అమ్మకాల్లో దాదాపు 40శాతం కేవలం 125సీసీ బైకుల నుంచే వస్తుంది. అందుకే, కొత్త మోడల్‌ను తీసుకురావడం ద్వారా బజాజ్ మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని చూస్తోంది. 2026 నాటికి 125సీసీ సెగ్మెంట్ 8-12శాతం పెరగొచ్చని బజాజ్ అంచనా వేస్తోంది. ఈ కొత్త బైక్ టీవీఎస్ రెడర్, హోండా షైన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వగలదు. దీనిని పల్సర్ బ్రాండ్ కిందే విడుదల చేస్తారని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. బజాజ్ తన పాత సీటీ125ఎక్స్  బైక్‌ను కొత్త రూపంలో తిరిగి తీసుకురావచ్చని చెబుతున్నారు. ఈ బైక్ ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే కస్టమర్‌ల కోసం ఉద్దేశించినది. ప్రస్తుతం 125సీసీ+ సెగ్మెంట్‌లో బజాజ్ రెండో స్థానంలో ఉంది, మొదటి స్థానంలో హోండా ఉంది. ఈ రెండింటి మధ్య దాదాపు 5-6% తేడా ఉంది. కొత్త బైక్ ద్వారా ఈ తేడాను తగ్గించుకోవాలని బజాజ్ ప్రయత్నిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)